AP: ముగ్గురు పిల్లలను కనాలన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చే రూ.25 వేలతో 25 ఏళ్ల పాటు పిల్లలను ఎవరు పోషిస్తారని ప్రశ్నించారు. 20 ఏళ్ల క్రితం ముగ్గురు పిల్లలు వద్దన్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చడం ఆయన అస్థిరతకు నిదర్శనమన్నారు. ఈ వైఖరితోనే ఆయన విజనరీ కాదని అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.