యంగ్ బ్యూటీ రితికా నాయక్ తన మనసులో మాటను బయటపెట్టింది. ‘అల్లు అర్జున్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అతిపెద్ద కల. ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే నేను అస్సలు వదులుకోను. ఆ అవకాశం వస్తే అది చిన్న పాత్ర అయినా సరే, చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ అంటే తనకు అంత ఇష్టమని, ఆయన ఎనర్జీ, డ్యాన్స్ అంటే పడిచస్తానని తెలిపింది.