MNCL: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల దిగుబడి పెంచే మార్గాలు, భూమి సారాన్ని కాపాడుకునే విధానాలను అవలంబించాలని ADA రాజ నరేందర్ అన్నారు. ఆత్మ ఆధ్వర్యంలో తాండూర్ మండలం కిష్టంపేట రైతు వేదికలో సోమవారం రైతులకు వ్యవసాయ అంశాలపై అవగాహన కల్పించారు. అనుమతి లేని హెబ్రీ కాటన్ పత్తి విత్తనాల సాగు రైతులకు నష్టాలను కలిగించే ప్రమాదం ఉందని సూచించారు.