• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

అది అత్యంత కష్టమైన సంభాషణ: నటి

క్యాన్సర్ చికిత్స తీసుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ ప్రముఖ నటి సోనాలి బింద్రే ఎమోషనల్ అయ్యారు. ‘ఆరోగ్యకరమైన జీవనశైలి గడిపినప్పటికీ క్యాన్సర్ బారిన పడ్డాను. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. క్యాన్సర్ విషయం నా కుమారుడికి చెప్పడం చాలా కష్టమైంది. అది అత్యంత కష్టమైన సంభాషణగా అనిపించింది’ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

December 14, 2024 / 01:19 PM IST

మీడియా వారి తప్పు లేదు: మంచు మనోజ్

నటుడు మోహన్ బాబు నివాసం వద్ద జర్నలిస్ట్‌పై దాడి ఘటనపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ‘నిస్సహాయ స్థితిలో నేను మీడియాను లోపలికి తీసుకెళ్లాను. మా ఇంట్లోకి నన్ను అనుమతించకపోవటంతోనే మీడియా ప్రతినిధులను వెంటపెట్టుకుని తీసుకెళ్లాను. లోపలికి వెళ్లాక జర్నలిస్ట్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో మీడియా వారి తప్పులేదు’ అని పేర్కొన్నారు.

December 14, 2024 / 01:02 PM IST

మంచు విష్ణు కీలక ప్రకటన

తరంగ వెంచర్స్ పేరుతో మంచు విష్ణు.. మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ టెక్నాలజీల రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ సంస్థలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ భాగం కావడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. దీనిపై చర్చలు జరుగుతున్నట్లు, త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతున్నట్లు చెప్పారు. కాగా, 50 మిలియన్ డాలర్ల నిధులతో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు.

December 14, 2024 / 12:51 PM IST

BREAKING: మోహన్ బాబు కీలక ప్రకటన

తాను అజ్ఞాతంలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మంచు మోహన్ బాబు కీలక ప్రకటన చేశారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు తెలిపారు. కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించలేదని వెల్లడించారు. వాస్తవాలను బయటపెట్టాలని మీడియాను కోరుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇంట్లో వైద్యుల సంరక్షణలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

December 14, 2024 / 12:01 PM IST

అల్లు అర్జున్‌ను కలిసిన చిరంజీవి భార్య సురేఖ

జూబ్లీహిల్స్‌లోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులు వస్తున్నారు. తన మేనల్లుడు అల్లు అర్జున్‌ను చిరంజీవి భార్య సురేఖ కలిశారు. ఆయన్ను హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. తాజా పరిణామాల గురించి మాట్లాడారు. బన్నీకి ధైర్యం చెప్పారు. అలాగే రాఘవేంద్రరావు, రానా దగ్గుబాటి, రాజకీయనేత గంటా శ్రీనివాస్ రావు, శ్రీకాంత్, R నారాయణమూర్తి, హరీష్ శంకర్, నిర్మాత సురేష్ బాబు, నాగ చైతన్య తదితరులు ...

December 14, 2024 / 11:35 AM IST

తన ఫస్ట్ లవ్ స్టోరీని బయటపెట్టిన రాజమౌళి

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ది రానా దగ్గుబాటి షో’లో రాజమౌళి, RGV పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా తన ఇంటర్ లవ్ స్టోరీని రాజమోళి భయపెట్టారు. ‘ఇంటర్ చదువుతున్న సమయంలో ఓ అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆమెతో మాట్లాడాలంటే భయం ఉండేది. అయితే మొత్తం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఆమెతో చాలా కష్టంగా మాట్లాడాను. ట్యూషన్ ఫీజ్ ...

December 14, 2024 / 11:16 AM IST

రానా దగ్గుబాటి బర్త్ డే స్పెషల్

మూవీలో కంటెంట్ ఉందనిపిస్తే.. నటించడానికి, నిర్మాతగా, ప్రజెంటర్‌గా వ్యవహరించడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని హీరో రానా దగ్గుబాటి. 2010లో ‘లీడర్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. బాహుబలితో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. పలు సినిమాల్లో సపోర్ట్ రోల్స్ చేశారు. సినిమాలతో పాటు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాగా, ఇవాళ రానా దగ్గుబాటి బర్త్ డే సందర్భంగా ప్రమ...

December 14, 2024 / 10:19 AM IST

మరో భాషలో ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్..?

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న విడుదలవుతుంది. అయితే ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మాత్రమే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కన్నడలో కూడా దీన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  ఇక ఈ...

December 14, 2024 / 10:02 AM IST

అల్లు అర్జున్ అరెస్ట్.. జరిగింది ఇదే..!!

1. 13వ తేదీ మ.12 గంటలకు సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్. 2. మ. 2.50 గంటలకు గాంధీలో వైద్య పరీక్షలు పూర్తి. 3. మ. 3.15 గంటలకు నాంపల్లి కోర్టుకు తరలింపు. 4. సా. 4గంటలకు విచారణ. 5. సా. 4.30 గంటలకు 14 రోజుల జ్యుడిషయల్ రిమాండ్. 6. సా. 5.30 గంటలకు చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్. 7. సా.6 గంటలకు మధ్యంతర బెయిల్. 8. 14వ తేదీ […]

December 14, 2024 / 09:36 AM IST

బన్నీ అరెస్ట్ అమానుషం: చిన్ని కృష్ణ

అల్లు అర్జున్ అరెస్టుపై గంగ్రోతి సినిమా రచయిత చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బన్నీ అరెస్ట్ అమానుషం. అల్లుఅర్జున్‌పై చట్టపరంగా పెట్టిన సెక్షన్లన్నీ తప్పే. ఆయన వెనక పెద్ద కుటుంబం ఉంది. మెగా ఫ్యామిలీ అంటేనే మానవత్వం. అల్లు అర్జున్‌కి మరకలు అంటించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూసిన ఏ నాయకుడు అయినా, ప్రభుత్వమైనా సర్వనాశనం అయిపోతుంది’ అంటూ ఆగ్...

December 14, 2024 / 09:25 AM IST

అందరికీ థ్యాంక్స్: అల్లు అర్జున్

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మరణించిన రేవతికి మరోసారి నివాళి అర్పిస్తున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు. ‘రేవతి కుటుంబానికి అండగా ఉంటాం. ఆరోజు ఘటన ప్రమాదవశాత్తు జరిగింది. నేను ప్రస్తుతం బాగానే ఉన్నా. ఎవరూ ఆందోళన చెందవద్దు. లీగల్ విషయాల గురించి ఏమీ మాట్లాడదలచుకోలేదు. నాకు మద్దతు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

December 14, 2024 / 08:51 AM IST

ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్

జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ బన్నీతో న్యాయవాదుల బృందం చర్చలు జరిపారు. 45 నిమిషాల పాటు పలు అంశాలపై ఆయనతో లాయర్ నిరంజన్ రెడ్డి చర్చించారు. అనంతరం గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి నిరంజన్ రెడ్డి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ కూడా తాజాగా తన నివాసానికి చేరుకున్నారు. భార్య బిడ్డలను హత్తుకుని ఎమోషనల్ అయ్యారు.   

December 14, 2024 / 08:42 AM IST

అల్లరి నరేష్ కోసం రంగంలోకి నాని

డైరెక్టర్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘బచ్చల మల్లి’. ఈ నెల 20న ఇది రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ ఇవాళ సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు. ఇక హాస్య మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటించింది.

December 14, 2024 / 08:35 AM IST

బన్నీని అరెస్ట్ చేసిన షెకావత్ ఇతనే..!!

పుష్ప-2 సినిమాలో హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంలో ఎస్పీ షెకావత్ విఫలమైనా నిజ జీవితంలో ఓ పోలీస్ మాత్రం సక్సెస్ అయ్యాడు. ఆయన ఎవరు అంటూ నెటిజన్‌లు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆ పోలీస్ పేరు బానోత్ రాజు నాయక్. ఆశ్చర్యమైన అంశం ఏంటంటే.. ఆయన బన్నీకి వీరాభిమాని. ఒక్కసారైనా అతడితో ఫొటో దిగాలని భావించాడట. కానీ చివరికి అభిమాన హీరోనే అరెస్ట్ చేసి ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం.

December 14, 2024 / 08:24 AM IST

ఆ బాధ్యత ప్రజలకు కూడా ఉండాలి: కంగనా

సినిమాల్లో మద్యం, డ్రగ్స్‌పై పాటలు ఉండటంపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. మూవీల్లో ప్రతి అంశం భావోద్వేగాలకు సంబంధించిందని,  ఇలాంటి విషయాలపై చిత్రబృందంతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై మాట్లాడుతూ.. ఆయనకు తన పూర్తి మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. 

December 14, 2024 / 08:20 AM IST