బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనను ఓ వ్యాధి వల్ల నరకం చూశానని వెల్లడించింది. ‘నాకు అతిగా తినే అలవాటు ఉంది. అయినా కూడా ఆకలితో అలమటించినట్లు ఉండేది. కానీ, తినడం మానలేని పరిస్థితి. అలా ఒక ఏడాది పాటు ‘బులిమియా’ అనే వ్యాధితో పోరాడాను. దీనిపై ప్రస్తుతం నాకు మంచి అవగాహన వచ్చింది’ అని చెప్పుకొచ్చింది.
సీనియర్ నటి హేమా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి లక్ష్మి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. నిన్న ఉదయం కూడా తనతో మాట్లాడారని.. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని హేమా కన్నీటి పర్యంతమైంది.
ప్రముఖ నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వీరితో పాటు ‘అఖండ 2’ నిర్మాత గోపీ అచంట కూడా అప్పన్నను దర్శించుకున్నారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో వారిని ఆశీర్వదించి స్వామి వారి ప్రసాదం అందించారు.
మద్యం కుంభకోణం కేసులో తన పేరు వినిపించడంపై నటి కయాదు లోహార్ స్పందించింది. ఈ కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కయాదు.. ఆ వార్తలు చూసి తాను ఎంతో బాధపడ్డానని వెల్లడించింది. తాను ఎలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనలేదని, ఈ నిరాధారమైన ప్రచారం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె పేర్కొన్నారు.
విక్టరీ వెంకటేష్ అభిమానులకు గుడ్ న్యూస్. డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రం ‘ప్రేమంటే ఇదేరా’ను రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 1998లో వెంకటేష్, ప్రీతి జింటా కాంబోలో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను మళ్లీ థియేటర్లలో చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.
‘జోష్’ సినిమాతో గుర్తింపు పొందిన కమెడియన్ రవి ఇంట్లో విషాదం నెలకొంది. గుండెపోటుతో ఆయన తండ్రి హఠాన్మరణం చెందారు. గతవారమే ఈ ఘటన జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప.గో. జిల్లా మార్టేరు గ్రామంలో నివసించే రవి తండ్రి, కార్తీక సోమవారం సందర్భంగా శివాలయంలో అభిషేకం కోసం వెళ్లినప్పుడు అస్వస్థతకు గురయ్యారు. ఇంటికి తీసుకెళ్లే దారిలోనే గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.
సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి వంటి దిగ్గజాలకు నటనలో ఓనమాలు నేర్పించిన గురువు, దర్శకుడు కేఎస్ నారాయణస్వామి(92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. రజనీకాంత్‌కు బాలచందర్‌ను పరిచయం చేసి ఆయన కెరీర్‌కు పునాది వేసిన ఘనత నారాయణస్వామిదే. ఆయన మృతి వార్త విన్న రజనీ, స్వయంగా కేఎస్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న ‘వారణాసి’ మూవీ టైటిల్ గ్లింప్స్ ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ఈవెంట్ కోసం ఆమె తెలుగులో ప్రాక్టీస్ చేసిన వీడియోను పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. అందులో ‘తగలబెట్టేద్దామా?’ అంటూ ప్రియాంక క్యూట్‌గా మాట్లాడి ఫ్యాన్స్‌ను మెప్పించింది.
దిగ్గజ దర్శకుడు SS రాజమౌళి ఇటీవల ‘వారణాసి’ మూవీ ఈవెంట్‌లో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజమౌళిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం సభ్యులు సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘డ్యూడ్’ ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్‌లో రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఈనెల 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చిన తొలి వారంలోనే మిలియన్ వ్యూస్ సాధించి నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న భారీ చిత్రంపై సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా కంటెంట్, మేకింగ్ ఏ స్థాయిలో ఉండబోతోందో ఎవరూ ఊహించలేరని వెల్లడించాడు. ‘KGF’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్‌లకు సంగీతం అందించిన రవి వ్యాఖ్యలతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
‘ఉయ్యాల జంపాల’, ‘కుమారి 21F’ వంటి హిట్స్‌తో ప్రామిసింగ్ హీరోగా ఎదిగిన రాజ్ తరుణ్‌కు పర్సనల్ వివాదాల కారణంగా కెరీర్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజాగా ‘పాంచ్ మినార్’ ట్రైలర్ లాంచ్‌లో రాజ్ ఎమోషనల్ అయ్యాడు. ‘నన్ను తొక్కేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ నేను స్ప్రింగ్ లాంటి వాడిని, ఎంత తొక్కితే అంత పైకి లేస్తా’ అని ఆయన చేసిన కామె...
✦ రెండు పార్టులుగా ప్రభాస్ ‘ఫౌజీ’✦ రూ.28.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’✦ మా కుటుంబంలోనూ డిజిటల్ అరెస్ట్: నాగార్జున✦ పరిశ్రమను పైరసీ భూతం వేధిస్తోంది: చిరంజీవి✦ వచ్చే ఏడాదిలో నా పెళ్లి: సాయి దుర్గతేజ్✦ మూడు రోజుల్లో రూ.24.50 కోట్ల గ్రాస్ రాబట్టిన ‘కాంత’
హీరోయిన్ కీర్తి సురేష్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్ ఇండియా విభాగానికి సెలబ్రిటీ అడ్వకేట్‌గా ఎంపికైంది. పిల్లల మానసిక ఆరోగ్యం, హక్కుల గురించి ఆమె పని చేయనున్నట్లు యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా వెల్లడించారు. దీనిపై కీర్తి సురేష్ స్పందించింది. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవమని హర్షం వ్యక్తం చేసింది.
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన లయన్ కింగ్, మహా అవతార్ నరసింహా వంటి యానిమేషన్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే మరో యానిమేషన్ సినిమా ‘కికీ & కోకో’ త్వరలో విడుదల కానుంది. పి.నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పెద్దల్లోనూ చిన్నప్పటి మధురానుభూతులను మరోసారి గుర్తుచేస్తుందని నారాయణన్ తెలిపారు.