‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దర్శకుడు కిషోర్ తిరుమల వద్ద ఒక కథను తీసుకున్న రామ్.. మరో కథను కూడా అభివృద్ధి చేస్తున్నాడట. రైటింగ్ టీంతో కలిసి స్వయంగా కథా చర్చల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. సొంత బ్యానర్‌పై కొత్త దర్శకుడితో సినిమాను నిర్మించే ఆలోచనలో రామ్ ఉన్నట్లు తెలుస్తోంది.