• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

వెంకీ, త్రివిక్రమ్ మూవీపై లేటెస్ట్ బజ్..!

విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ ఓ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా డిసెంబర్ 15 నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆ షెడ్యూల్ వెంకీపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇక ఈ సినిమాలో కన్నడ నటి శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.

November 21, 2025 / 12:58 PM IST

ఓటీటీలోకి ఆస్కార్ నామినేటెడ్ మూవీ

98వ అకాడమీ అవార్డ్స్ కోసం ఇండియా నుంచి అధికారికంగా నామినేట్ అయిన బాలీవుడ్ చిత్రం ‘హోమ్‌బౌండ్’. తాజాగా ఈ మూవీ OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెరకెక్కించాడు. 

November 21, 2025 / 12:42 PM IST

‘ఇట్లు మీ ఎదవ’ రివ్యూ & రేటింగ్

ఆరేళ్లుగా PG చేస్తూ ఆవారాగా తిరిగే శ్రీను(త్రినాథ్).. మనస్విని(సాహితీ)ని ప్రేమిస్తాడు. అయితే వారి పెళ్లి జరగాలంటే శ్రీను 30 రోజుల్లో ఎదవ కాదు అని నిరూపించుకోవాలని షరతు పెట్టడంతో అతను ఏం చేశాడు? ఇచ్చిన గడువులోగా మంచోడు అని నిరూపించుకున్నాడా? లేదా అనేది ఈ సినిమా కథ. సినిమాటోగ్రఫీ, పాటలు, క్లైమాక్స్ మూవీకి ప్లస్. రొటీన్ లవ్ సీన్స్, కాలేజీ సీన్స్ మైనస్. రేటింగ్:2.25/5.

November 21, 2025 / 12:30 PM IST

‘రైడ్ 3’ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్, దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా కాంబోలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘రైడ్’. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రెండు పార్ట్‌లు రాగా.. త్వరలోనే మూడో పార్ట్ రాబోతుంది. తాజాగా ‘రైడ్ 3’ స్క్రిప్ట్ సిద్ధం అవుతున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

November 21, 2025 / 12:30 PM IST

‘రాజాసాబ్’ నుంచి అప్‌డేట్ వచ్చేసింది

రెబల్ స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌పై మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెల 23న ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదలవుతుంది.

November 21, 2025 / 12:13 PM IST

ఫస్ట్ సినిమాకే హీరోయిన్‌తో లవ్.. హీరో క్లారిటీ

బాలీవుడ్ యువ నటీనటులు అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన ‘సైయారా’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఫస్ట్ సినిమాతోనే అహాన్, అనీత్ పడ్డా ప్రేమలో పడినట్లు జోరుగా వార్తలొస్తున్నాయి. తాజాగా దీనిపై అహాన్ క్లారిటీ ఇచ్చాడు. అందులో ఎలాంటి నిజం లేదని, తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాడు. ప్రస్తుతం తాను సింగిల్ అని తెలిపాడు.

November 21, 2025 / 11:43 AM IST

‘అఖండ 2’ ట్రైలర్ రిలీజ్‌కు టైం ఫిక్స్

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2’ మూవీ DEC 5న రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దీని ట్రైలర్‌పై మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. బెంగళూరు సమీపంలోని చింతామణిలో ఇవాళ 5PMకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. రాత్రి 7:56 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. ఇక ఈ కార్యక్రమానికి కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

November 21, 2025 / 11:07 AM IST

OTTలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్స్

తమిళ హీరో ధృవ్ విక్రమ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘బైసన్’ OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే పలు సినిమాలు ఇవాళ థియేటర్లలో సందడి చేస్తున్నాయి.

November 21, 2025 / 10:20 AM IST

ఆ స్టూడియోలకు నోటీసులు.. ఎందుకంటే?

TG: అన్నపూర్ణ స్టూడియో 1,92,000 చ.అడుగుల విస్తీర్ణం బదులు 8,100 చ.అడుగులకే ట్యాక్స్ చూపించి.. రూ.11.52 లక్షలకు బదులు రూ.49 వేలు చెల్లిస్తుంది. రామానాయుడు సంస్థ 68 వేల చ.అడుగుల్లో వ్యాపారం చేస్తూ 1900 చ.అడుగులకు ట్యాక్స్ కడుతుంది. రూ.2.73 లక్షలకు బదులు రూ.7,600 చెల్లించినట్లు సమాచారం. దీంతో పూర్తి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని GHMC అధికారులు నోటీసులు జారీ చేశారు.

November 21, 2025 / 09:40 AM IST

‘రాజు వెడ్స్ రాంబాయి’ రివ్యూ & రేటింగ్

తెలంగాణలోని ఓ పల్లెటూరులోని ప్రేమ కథతో తెరకెక్కిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇవాళ విడుదలైంది. బ్యాండ్ వాయించే రాజు(అఖిల్), రాంబాయి(తేజస్విని) ప్రేమించుకుంటారు. వాళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి? చివరికి వారి ప్రేమను గెలిపించుకున్నారా? అనేది కథ. నటీనటుల నటన, ప్రేమకథను నడిపిన తీరు, క్లైమాక్స్ మూవీకి ప్లస్. నెమ్మదిగా సాగే కథనం, సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ మైనస్. రేటింగ్:2.75/5.

November 21, 2025 / 09:32 AM IST

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోకు నోటీసులు

TG: లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లించారని అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోకు GHMC అధికారులు నోటీసులు అందజేశారు. వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపించి ట్యాక్సులు ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. పూర్తి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.

November 21, 2025 / 09:28 AM IST

రష్మిక లవ్‌స్టోరీపై దీక్షిత్‌ కామెంట్

రష్మిక, దీక్షిత్ శెట్టి నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే, రష్మిక ఎంగేజ్‌మెంట్ గురించి దీక్షిత్‌ను ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన దీక్షిత్.. రష్మిక వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని చెప్పాడు. ఆమె ప్రేమ, ఎంగేజ్‌మెంట్ గురించి తానెప్పుడూ ఆమెతో చర్చించలేదని వెల్లడించాడు.

November 21, 2025 / 09:05 AM IST

ఆ హిట్‌ మూవీలా నిలిచిపోవాలి: అల్లరి నరేష్

దర్శకత్వంపై హీరో అల్లరి నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో దర్శకత్వం వహిస్తానని, ఆ మూవీ ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’లా నిలిచిపోవాలన్నది తన కోరిక అని పేర్కొన్నాడు. కాగా అల్లరి నరేష్ హీరోగా దర్శకుడు నాని కాసరగడ్డ తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ ’12A రైల్వే కాలనీ’. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

November 20, 2025 / 09:02 PM IST

బాలకృష్ణకు అరుదైన గౌరవం

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. గోవా వేదికగా ఘనంగా ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ వేడుకలో బాలయ్యను సన్మానించారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్, గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్రమంత్రి మురుగన్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. నటుడిగా 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా బాలకృష్ణకు ఈ గౌవరం దక్కింది.

November 20, 2025 / 08:17 PM IST

100 మిలియన్ వ్యూస్‌కి చేరువలో ‘చికిరి’ సాంగ్

రామ్ చరణ్ నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి’ పాట రికార్డులను సృష్టిస్తోంది. ఈ సాంగ్ ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి 90 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. 1.5 మిలియన్ల లైక్స్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.

November 20, 2025 / 07:45 PM IST