డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్‌ను నిర్మాత అల్లు అరవింద్ కుటుంబ సమేతంగా కలిశారు. మార్చి 6న హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు పెళ్లికి పవన్ కళ్యాణ్ దంపతులను అల్లు అరవింద్ ఆహ్వానించారు. కాగా ఇప్పటికే దుబాయ్‌లో పార్టీస్, పసుపు దంచుడు వంటి కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
దళపతి విజయ్ నటించిన చివరి, 69వ తమిళ చిత్రం ‘జననాయగన్’. హెచ్. వినోద్ దర్శకత్వంలో KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ రాజకీయ యాక్షన్ థ్రిల్లర్, సెన్సార్ బోర్డు వివాదాల నుండి బయటపడి, విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాను విజయ్ పుట్టినరోజుకు విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ మూవీ తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రశాంత్ వర్మ ఈ మూవీ కోసం ఆస్కార్ విజేత, సంగీ దిగ్గజం ఎం.ఎం కీరవాణిని రంగంలోకి దించారు. ఈ విషయాన్ని హనుమంతుడిగా నటిస్తున్న రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా పోస్ట్‌లో కన్ఫర్మ్ చేశారు.
అంతర్జాతీయ వేదికగా మణిపురీ సినిమా ‘బూంగ్’కు బాఫ్టా అవార్డు దక్కింది. బెస్ట్ చిల్డ్రన్స్- ఫ్యామిలీ ఫిల్మ్ కేటగిరీలో పురస్కారం లభించింది. ఇది ఈశాన్య భారత సినిమాకు దక్కిన అరుదైన గౌరవం. బూంగ్ చిత్రానికి లక్ష్మీప్రియా దేవి దర్శకత్వం వహించారు. మణిపూర్‌లోని సరిహద్దు పట్టణం మోరె నుంచి తన తండ్రిని వెతుక్కుంటూ మయన్మార్‌లోకి బాలుడు వెళ్లే కథతో తెరకెక్కింది.
తాము పెళ్లి చేసుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ-రష్మిక మంధాన స్వయంగా ప్రకటించారు. అభిమానులను ఉద్దేశించి ఒకే తరహా నోట్‌ను ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్ చేశారు. ‘ప్లాన్ చేయడానికి ముందే మీరు ప్రేమతో మాకు VIROSH అని పేరు పెట్టారు. మీ అభిమానానికి గుర్తుగా మా వేడుకను THE WEDDING OF VIROSH పేరిట నిర్వహించాలని అనుకుంటున్నాం. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.
‘జై బోలో తెలంగాణ’ మూవీ షూటింగ్ విశేషాలను జగపతి బాబు తాజాగా పంచుకున్నారు. ఉద్యమ సమయంలో వరంగల్‌లో షూటింగ్ ఉద్రిక్తంగా ఉండటంతో, తండ్రి వద్దన్నా మొండిగా వెళ్లానని చెప్పారు. రక్షణ కోసం తన వద్ద గన్ ఉంచుకున్నట్లు వెల్లడించి షాక్ ఇచ్చారు. ఆ సినిమా చేసినందుకు ఆంధ్రాలో కొందరు బాధపడినా, వరంగల్ ప్రజలు తనను ఎంతో గౌరవంగా చూసుకున్నారని ఆయన గుర్తు చేసుకున్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను, యంగ్ హీరో గాలి కిరీటీ కాంబోలో ఒక భారీ యాక్షన్ మూవీ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తనదైన మాస్ ఎలివేషన్లతో హీరోలను పవర్‌ఫుల్‌గా చూపించే బోయపాటి, కిరీటిని ఎలా ప్రెజెంట్ చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, కిరీటీ ‘జూనియర్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
టాలెంటెడ్ నటి సాయి పల్లవి తన ఖాతాలో మరో అరుదైన రికార్డును వేసుకుంది. తాజాగా జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ‘అమరన్’ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డును అందుకుంది. దీంతో ఆమె కెరీర్‌లో మొత్తం 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు చేరాయి. ప్రేమమ్, ఫిదా, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ, గార్గి, విరాటపర్వం, అమరన్ సినిమాలతో ఆమె ఈ ఘనత సాధించింది.
హీరో శర్వానంద్‌తో దర్శకుడు శ్రీను వైట్ల ఓ మూవీని తెరకెక్కించనున్నాడట. ప్రస్తుతం ఈ మూవీ మ్యూజిక్‌పై పని జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 జూన్ నుంచి స్టార్ట్ కానున్నట్లు టాక్. ముందుగా శర్వా లేని సీన్స్‌ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.
ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ వాలెంటిన్ హెనాల్ట్ తన పుస్తకం ‘J’avais un rêve indien’ ద్వారా గోరఖ్‌పూర్ జైలులోని దారుణాలను బయటపెట్టారు. 2023లో అక్కడ జైలు జీవితం గడిపిన ఆయన, ఖైదీలను గాలి కూడా ఆడనంతగా కుక్కేవారని పేర్కొన్నారు. ముస్లింలు, దళితులపై వివక్ష చూపుతూ, అగ్రవర్ణాలకే మెరుగైన సౌకర్యాలు ఇస్తున్నారని, సరైన వైద్యం అందక ఖైదీలు మరణిస్తున్నారని సంచలన విషయాలు వెల్లడించారు.
తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’లో సమంత నటిస్తోన్న మూవీ ‘మా ఇంటి బంగారం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. 2026 మే 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక నందిని రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
‘ది కేరళ స్టోరీ’ మూవీపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ సినిమా కేరళ వాస్తవాలను ప్రతిబింబించడం లేదని పరోక్షంగా విమర్శించారు. ఆ రాష్ట్రపు అసలైన సంస్కృతిని రుచి చూడమని చెప్పారు. కేరళకు చెందిన ప్రసిద్ధ వంటకాలు ‘బీఫ్ ఫ్రై’, కొబ్బరితో చేసిన ‘బీఫ్ కర్రీ’ ఫోటోలను షేర్ చేశారు. ‘అసలైన కేరళ స్టోరీని రుచి చూడండి’ అంటూ తన SM వేద...
ప్రదీప్ రంగనాథన్, దర్శకుడు అశ్వత్ మారిముత్తు కాంబోలో వచ్చిన ‘డ్రాగన్’ మూవీ ఘనవిజయం సాధించి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అశ్వత్ నెట్టింట పోస్ట్ పెట్టాడు ‘సెల్ఫ్ మేడ్ స్టార్ ప్రదీప్‌తో పనిచేయడం మర్చిపోలేను. త్వరలోనే తాము రెండోసారి తప్పకుండా వస్తాం’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ‘డ్రాగన్ 2’ సీక్వెల్ రాబోతుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు బాలీవుడ్ భామలు భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో త్రిప్తి డిమ్రి కథానాయికగా నటించనుండగా.. మరో కీలక పాత్రలో సీనియర్ నటి మాధురి దీక్షిత్ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 జూన్ నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.
మూవీ థియేటర్ల భవిష్యత్తుపై దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘OTTల సబ్‌స్క్రిప్షన్ మోడల్ వల్ల మూవీలు నేరుగా స్ట్రీమింగ్‌కే పరిమితమై, థియేట్రికల్ బిజినెస్ దెబ్బతినే ప్రమాదం ఉంది. వార్నర్ బ్రదర్స్ వంటి పెద్ద స్టూడియోలు ఇదే బాట పడితే భారీ బడ్జెట్ మూవీల నిర్మాణం తగ్గిపోవచ్చు. అయితే నా మొదటి ప్రాధాన్యత మాత్రం థియేటర్ ఎక్స్‌పీరియెన్సే’ అని తెలిపారు.