‘క’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కొత్త దర్శకుడు యుడ్లీతో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ‘కే10’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు ‘దిల్ రుబా’ అనే పేరు ఫిక్స్ చేశారట. ఇక ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ సమర్పణలో ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ సంస్థ నిర్మిస్తోంది.
ఓ ఇంటర్వ్యూలో రామాయణంపై ఎదురైన ప్రశ్నకు నటి సోనాక్షి సిన్హా జవాబు ఇవ్వకపోవడంపై శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా స్పందించారు. తప్పు ఆమెది కాదని.. ఆమె తండ్రిదని.. పురాణాల గురించి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించకపోవడాన్ని తప్పుబట్టారు. దీంతో ఆయనపై సోనాక్షి తండ్రి శత్రుఘ్న అసహనం వ్యక్తం చేశారు. ‘ఆ వ్యక్తి రామాయణానికి సంబంధించిన అన్ని విషయాల్లో నిపుణుడా? మతాన్ని సంరక్షించే బాధ్యత ఆయనకు ఏమైనా...
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఫ్యామిలీపై ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిద్ధం చేసింది. హృతిక్ తాతయ్య, మ్యూజిక్ డైరెక్టర్ రోషన్, ఆయన కుటుంబం నేపథ్యంలో ‘ది రోషన్స్’ సిరీస్ రూపొందించారు. తాజాగా దీని OTT రిలీజ్ డేట్ వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సదరు సంస్థ పోస్టర్ షేర్ చేసింది.
‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. ‘మహానటి’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. తాజాగా ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హిందీలో ‘బేబీ జాన్’ సినిమా చేస్తుంది. ఈ మూవీ కోసం కీర్తి డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో రూ.2 కోట్ల మేర పారితోషికం తీసుకునే ఆమె.. ఈ సినిమా కోసం రూ.4 కోట్లకుపైగా రెమ్యూనరేషన్ తీసుకుంద...
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’ మూవీ భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా దక్షిణాది భాషల్లో.. డిస్నీ+హాట్‌స్టార్‌లో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో ఈ సినిమా 300 రోజుల నుంచి టాప్‌లో ట్రెండవుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కాగా.. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ ...
తమిళ హీరో అజిత్ కుమార్, దర్శకుడు తిరుమేని కాంబోలో రాబోతున్న సినిమా ‘విడాముయార్చి’. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయిందని మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు అజిత్, త్రిషల ఫొటోలను షేర్ చేశారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, రెజీనా సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ప్రేమ, భాగస్వామి గురించి నేషనల్ క్రష్ రష్మికా మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒడుదొడుకుల్లో తన వెన్నంటే ఉండే భాగస్వామి కావాలని చెప్పారు. ప్రతి దశలోనూ తోడుండాలని, ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, రష్మిక ఇదివరకే ఓ హీరోతో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు తరచూ వస్తోన్న విషయం తెలిసిందే.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న విడుదలవుతుంది. ఈ మూవీ నుంచి ‘ధోప్’ అనే పాట రాబోతుంది. ఇవాళ సాయంత్రం ఈ పాట ప్రోమో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.. వెంకటేష్ బర్త్ డే రోజున రెండో పాట ‘మీను’ ప్రోమో విడుదల కాగా.. ఫుల్ పాటను రేపు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా వచ్చే నెల 14న విడుదల కానుంది.
అల్లరి నరేష్-సుబ్బు మంగదేవి కాంబోలో తెరకెక్కుతున్న బచ్చలమల్లి సినిమా ఈ నెల 20 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు హాజరైన యువ హీరో కిరణ్ అబ్బవరం అల్లరి నరేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్నో విభిన్న రోల్స్ చేసిన నరేష్‌కు స్టార్ ట్యాగ్ ఇవ్వాలని అతని అభిమానిగా కోరుకుంటున్నానని అన్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్...
చాలా మంది లేడీస్ అందానికి ఎంతో ప్రియారిటీ ఇస్తుంటారు. ఇంకా సెలబ్రిటీల విషయానికి వస్తే అందం కోసం వారు చేసే ఖర్చు మామూలుగా ఉండదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హాలీవుడ్ నటి కిమ్ కర్థాషియాన్ తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది. తాను స్పెర్మ్‌తో ఫేషియల్ చేయించుకుంటుందని, కానీ అది సాల్మన్ చేపల నుంచి సేకరించిన వీర్యమని పేర్కొంది.
TG: టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వార్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబుకు చెందిన మరో గన్‌ను ఫిలింనగర్ పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటికే ఒక గన్‌ను మోహన్ బాబు సరెండర్ చేశారు. కాగా, ఇవాళ మరో గన్‌ను పోలీసులు సీజ్ చేశారు.
TG: HYD ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు సీపీ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 4న రాత్రి పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటనపై లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో సీపీ పేర్కొన్నారు.
అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమా విడుదలై నేటికి మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. కాగా, ‘పుష్ప’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇక హిందీతో పాటు ఇతర భాషల్లో మాసివ్ క్రేజ్ సంపాదించుకుంది. మూడేళ్ల తర్వాత వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 11 రోజ...