ఓ ఇంటర్వ్యూలో రామాయణంపై ఎదురైన ప్రశ్నకు నటి సోనాక్షి సిన్హా జవాబు ఇవ్వకపోవడంపై శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా స్పందించారు. తప్పు ఆమెది కాదని.. ఆమె తండ్రిదని.. పురాణాల గురించి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించకపోవడాన్ని తప్పుబట్టారు. దీంతో ఆయనపై సోనాక్షి తండ్రి శత్రుఘ్న అసహనం వ్యక్తం చేశారు. ‘ఆ వ్యక్తి రామాయణానికి సంబంధించిన అన్ని విషయాల్లో నిపుణుడా? మతాన్ని సంరక్షించే బాధ్యత ఆయనకు ఏమైనా అప్పగించారా?’ అని ప్రశ్నించారు.