TPT: నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను తిరుపతి కార్పొరేషన్ సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పడగొట్టారు. నగరంలోని ఎర్రమిట్ట రాయల్ నగరంలో 30 అంకణాల స్థలంలో అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మిస్తున్నారు. కమిషనర్ ఎన్.మౌర్య ఆదేశాల మేరకు డీసీపీ ఖాన్ ఆధ్వర్యంలో తొలగించారు. తమ అనుమతి, ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.