MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలో బుధవారం క్రీడా పాఠశాల ప్రవేశాల కొరకు విద్యార్థులకు ఫిజికల్ పరీక్షలు నిర్వహించారు. ఎంఈఓ మల్లేశం ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో విద్యార్థిని, విద్యార్థులకు క్రీడా సామర్ధ్య పరీక్షలను నిర్వహించారు. నాలుగవ తరగతిలో ప్రవేశాల కొరకు ఈ ఫిజికల్ టెస్ట్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.