• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

ప్రేమ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు వీరే!

టాలీవుడ్‌లో చాలామంది సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహేష్ బాబు-నమ్రత, నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహ వంటి సీనియర్లతో పాటు.. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి, కిరణ్ అబ్బవరం-రహస్య, వరుణ్ సందేశ్-వితిక, నాగ అశ్విన్-ప్రియాంక దత్, నాగ చైతన్య-శోభిత, విజయ్-రష్మిక వైవాహిక బంధంలో ఉన్నారు.

February 27, 2026 / 01:40 PM IST

సందీప్ కిషన్‌కు జోడీగా రితికా నాయక్ !

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌కు జోడీగా ‘మిరాయ్’ బ్యూటీ రితికా నాయక్ నటించనున్నట్లు తెలుస్తోంది. సందీప్ హీరోగా దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘పవర్ పేట’. ఇందులో కథానాయికగా రితిక నటించనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాను 70MM ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుంది.

February 27, 2026 / 01:10 PM IST

విరోష్‌ జోడీకి సెలబ్రిటీల శుభాకాంక్షలు

టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఒకటయ్యారు. ఫిబ్రవరి 26న వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సమంత, కరణ్ జోహార్, నాని, కాజల్ అగర్వాల్, కృతి సనన్ వంటి ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు తమ అభిమాన నటీనటులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడంతో పండగ చేసుకుంటున్నారు.

February 27, 2026 / 12:36 PM IST

ప్రధాని మోదీని కలిసిన విజయ్‌, రష్మిక

ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. మార్చి 4న హైదరాబాద్‌లో జరగనున్న తమ రిసెప్షన్‌ వేడుకకు రావాలని కోరుతూ వారు ప్రధానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. FEB 26న రష్మిక, విజయ్ పెళ్లి జరగ్గా.. నెటిజన్లు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.

February 27, 2026 / 12:14 PM IST

పవన్ కళ్యాణ్ కోసం హోంబలే ఫిల్మ్స్!

పవన్‌ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ 2026 మార్చి 26న విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ క్రేజ్, హోంబలే బ్రాండ్ తోడవడంతో అక్కడ రికార్డు వసూళ్లు రావడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. 

February 27, 2026 / 12:06 PM IST

ఈటీవీ విన్ @3.. కొత్త సినిమాల ప్రకటన

ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఈటీవీ విన్’ రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కొత్త లోగో, కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది. తిరువీర్ హీరోగా నటిస్తున్న ‘పాపం ప్రతాప్’ మూవీని ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ ‘పాకశాల పంతం’ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేస్తామంది.

February 27, 2026 / 11:36 AM IST

OTTలోకి వచ్చేసిన ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’

రాజీవ్‌ కనకాల, ఉదయభాను, వాసంతిక ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘డాటర్‌ ఆఫ్‌ ప్రసాద్‌రావు: కనబడుటలేదు’. కృష్ణ పోలూరు దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ తాజాగా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం, ఉత్కంఠభరితమైన థ్రిల్లింగ్‌ అంశాలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.

February 27, 2026 / 11:26 AM IST

శబరిమల కేసు.. మోహన్‌లాల్, దిలీప్‌ల స్టేట్‌మెంట్ రికార్డ్

శబరిమల అయ్యప్ప ఆలయ ధ్వజస్తంభం ఏర్పాటులో జరిగిన నిధుల గోల్‌మాల్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో నటులు మోహన్‌లాల్, దిలీప్ స్టేట్‌మెంట్‌లను కేరళ పోలీసులు రికార్డ్ చేశారు. 2017లో ధ్వజస్తంభం పునరుద్ధరణ సమయంలో జరిగిన అవకతవకలు, నిధుల వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరిగింది. దర్యాప్తులో భాగంగానే ఈ ప్రక్రియ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

February 27, 2026 / 11:14 AM IST

మృణాల్‌తో ఐకాన్ స్టార్?.. హింట్ ఇచ్చిన బన్నీ

అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబో మూవీలో మృణాల్ ఠాకూర్ నటిస్తోందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల బన్నీకి ఫిల్మ్‌ఫేర్ అవార్డు రాగా, మృణాల్ శుభాకాంక్షలు తెలిపింది. దీనికి బన్నీ స్పందిస్తూ.. ‘త్వరలో నీతో కలిసి పని చేయాలని ఆశిస్తున్నా’ అంటూ కన్నుకొట్టే ఎమోజీతో హింట్ ఇచ్చాడు. అట్లీ మూవీ కాకపోయినా, వీరిద్దరి కాంబో సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

February 27, 2026 / 11:06 AM IST

అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు అంత సిద్ధం!

హీరో అల్లు శిరీష్‌ వివాహ వేడుకలు మొదలయ్యాయి. మార్చి 6న నయనికతో ఆయన ఏడు అడుగులు వేయనున్నాడు. ఈ క్రమంలో మార్చి 2న అల్లు స్టూడియోస్‌లో అత్యంత గ్రాండ్‌గా ‘ప్రీ వెడ్డింగ్‌’ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్‌ ప్రముఖులు, సన్నిహితులు హాజరుకానున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనున్న ఈ వేడుక ఏర్పాట్లను శిరీష్ స్వయంగా వెల్లడించాడు.

February 27, 2026 / 10:36 AM IST

రెండు భాగాలుగా రానున్న ‘స్వయంభు’

నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘స్వయంభు’. విజువల్ గ్రాండియర్‌గా రూపొందుతున్న ఈ మూవీపై తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. కథా దృష్ట్యా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు నిఖిల్ స్వయంగా ప్రకటించాడు. 2026 ఏప్రిల్ 10న తొలి భాగాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ వార్తతో ఫ్యాన్స్‌లో అంచనాలు రెట్టింపయ్యాయి.

February 27, 2026 / 10:26 AM IST

రెండు OTTల్లో వచ్చేసిన ‘హనీ’

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ ‘హనీ’. కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఒకేసారి రెండు OTTల్లోకి వచ్చేసింది. సన్‌నెక్స్ట్‌లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అమెజాన్ ప్రైమ్‌లో పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉంది.

February 27, 2026 / 10:00 AM IST

విజయ్, రష్మిక పెళ్లి చూడడం నా అదృష్టం: హీరోయిన్

విజయ్ దేవరకొండ, రష్మిక మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి వివాహానికి నటి కళ్యాణి ప్రియదర్శన్ హాజరై సందడి చేసింది. ఈ వివాహాన్ని చూడడం తన అదృష్టమంటూ తాజాగా ఆమె పోస్ట్ చేసింది. విజయ్, రష్మిక మండపం వైపు వస్తున్నప్పుడు వారిద్దరి కళ్లల్లో ఆనందభాష్పాలు వారి ప్రేమకు చిహ్నాలుగా నిలిచాయని తెలిపింది. ఈ జంటను చూడడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

February 27, 2026 / 09:46 AM IST

ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైన నిఖిల్

వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో నిఖిల్ OTTలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. తాను త్వరలోనే ఒక వెబ్ సిరీస్‌లో నటించనున్నట్లు నిఖిల్ వెల్లడించాడు. దీని ద్వారా తన డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎంట్రీ ఉంటుందని తెలిపాడు. మరి ఆయన OTT ఎంట్రీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.

February 27, 2026 / 09:22 AM IST

OTTలోకి ‘హాట్‌స్పాట్‌ 2 మచ్‌’ తెలుగు వెర్షన్‌

యువతను ఆకట్టుకున్న తమిళ బోల్డ్ మూవీ ‘హాట్‌స్పాట్ 2 మచ్’ ఇప్పుడు తెలుగులో అలరించనుంది. దర్శకుడు విఘ్నేశ్ కార్తీక్ తెరకెక్కించిన ఈ మూవీ ‘హాట్ స్పాట్'(2024)కు సీక్వెల్‌గా రూపొందింది. నేటి సమాజంలోని వివాదాస్పద అంశాల నేపథ్యంలో సాగే ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో తమిళ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. FEB 27 నుంచి ఆహాలో దీని తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది.

February 27, 2026 / 09:10 AM IST