నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మూవీ ‘అఖండ 2’ డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. అదే రోజున బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ‘దురంధర్’ మూవీ కూడా విడుదల కానుంది. అయితే ఈ మూవీకి షాకింగ్ రన్ టైం లాక్ చేసినట్లు సమాచారం. 3 గంటల 32 నిమిషాల నిడివితో రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని భాషల్లో విడుదలవుతున్న బాలయ్య చిత్రానికి పోటీ ఇస్తుందా చూడాలి.
iBOMMA కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. 2023లో ‘ఖుషీ’ పైరసీ టైంలో.. హీరో విజయ్ దేవరకొండకు రవి ఓపెన్ ఛాలెంజ్ విసిరాడట. ‘మా మీద ఫోకస్ పెడితే.. మీ సినిమాలు లీక్ చేస్తాం. ఏజెన్సీలు మిమ్మల్ని మోసం చేస్తున్నాయి, మమ్మల్ని తొక్కి మా పేరుతో iBOMMAFF.in పేరుతో రన్ చేస్తున్నారు’ అంటూ తమ జోలికి రావద్దని రవి పెట్టిన ఆ మెసేజ్‌ను పోలీసులు తాజాగా బయటపెట్టారు.
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్‌లలో దివ్యకు తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. గత వారం కూడా ఆమెకు తక్కువ ఓట్లు వచ్చి, ఎలిమినేషన్ దాదాపు ఖాయమైంది. ఆ సమయంలో ‘పవరాస్త్ర’ కారణంగా ఆమె సేవ్ అయింది. కానీ, ఈ వారం ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అవడం ఖాయమని సమాచారం.
నటుడు అనుపమ్ ఖేర్ తన నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 540కి పైగా చిత్రాలలో నటించాడు. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా దక్కించుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించినట్లు తెలిపాడు. 2000 సంవత్సరంలో తన వద్ద కేవలం రూ.400 మాత్రమే ఉన్నాయనిద.. అలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొని కూడా తాను ఈ స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. యంగెస్ట్ చెస్ ట్రైనర్, 30 పజిల్స్ సాల్వ్ చేయడంలో 50 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఆమె ఈ రికార్డును సొంతం చేసుకుంది. దీంతో అల్లు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘తండ్రికి తగ్గ కూతురు’ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
జూ.ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘డ్రాగన్’. ఈ సినిమాలో మలయాళ స్టార్ టోవినో థామస్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. గోవాలో జరుగుతున్న IFFIలో పాల్గొన్న థామస్‌ను.. NTRNeel మూవీలో భాగమవుతున్నారా? అని అడగ్గా.. ‘దీని గురించి ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేను’ అని చెప్పాడు. దీంతో మూవీలో తాను ఉన్నట్లు టోవినో పరోక్షంగా హింట్ ఇచ్చాడని నెటిజన్లు భావిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ‘సూపర్ ఫ్యాన్ టికెట్’ అంటూ మొదటి టికెట్ వేలం వేయగా.. జర్మనీకి చెందిన బాలయ్య అభిమాని రాజశేఖర రూ. 2 లక్షలకు కొనుగోలు చేశాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ‘బాలయ్య అభిమానులతో మామూలుగా ఉండదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తన కష్ట సమయంలో హీరో శ్రీవిష్ణు అండగా నిలిచాడని దర్శకుడు వేణు ఊడుగుల తెలిపాడు. శ్రీవిష్ణుతో ‘నీదీ నాదీ ఒకే కథ’ మూవీ చేస్తున్న సమయంలో తాను ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నానని చెప్పాడట. తన పరిస్థితి తెలుసుకుని శ్రీవిష్ణు తన అప్పులన్నీ తీర్చేశాడని, ఈ విషయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నాడు. ఆయనని హీరో కాదు.. తన కష్టకాలంలో అండగా నిలబడిన ఓ దైవంగా భావిస్తానని అన్నాడు.
తాను హీరోయిన్ ఎలా అయ్యాననే విషయం గురించి నటి కృతి శెట్టి తెలిపింది. ఓ వాణిజ్య ప్రకటన ఆడిషన్స్‌కు వెళ్లానని, అది ముగిసిన తర్వాత తనను తీసుకెళ్లడానికి తండ్రి రావడం ఆలస్యమైందని చెప్పింది. దాంతో సమీపంలో మూవీ కోసం ఆడిషన్స్ చేస్తున్న స్టూడియోకి వెళ్లినట్లు పేర్కొంది. అలా దర్శకుడు చిట్టిబాబు ఫోన్ చేసి తల్లితో మాట్లాడారని, ఉప్పెనతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినట్లు తెలిపింది.
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రెండు రోజుల్లో రూ.12కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్లకుపైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిపినట్లు.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 28కోట్లకుపైగా షేర్ అందుకోవాలని పేర్కొన్నాయి.
రవితేజ, శ్రీలీల జంటగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ధమాకా’. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ‘డబుల్ ధమాక’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ కూడా చేయించినట్లు టాక్ నడుస్తోంది. ఇక దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ‘ధమాకా’ రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించ...
మహేష్ బాబు, రాజమౌళి ‘వారణాసి’ మూవీపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే టైటిల్‌ను రెండేళ్ల క్రితం రిజిస్టర్ చేయించుకున్నట్లు దర్శకుడు ఒకరు TFPCలో ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ వివాదం క్లియర్ అయినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను ‘రాజమౌళి వారణాసి’ పేరుతో, మిగతా భాషల్లో ‘వారణాసి’ పేరుతో విడుదల కానున్నట్లు సమాచారం.
TG: పోలీసుల చివరి రోజు కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి కీలక వ్యాఖ్యలు చేశాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మొత్తం మారిపోతానని, మళ్లీ తాను పైరసీ జోలికి వెళ్లనని పేర్కొన్నాడు. ఆరేళ్లపాటు తనను ఎవరూ పట్టుకోకపోవడంతో అదే ధీమాతో నెట్ వర్క్ కొనసాగించానని వెల్లడించాడు. డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో మొదలు పెట్టానని, కానీ ఇది తప్పని గుర్తించలేకపోయానని తెలిపాడు.
తమిళ హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘తేరే ఇష్క్ మే’. ఈ మూవీ హిందీ, తమిళం భాషల్లో నిన్న రిలీజ్ కాగా.. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. హిందీలో ఫస్ట్ డే ఈ మూవీ రూ.16 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇది ధనుష్ బాలీవుడ్ కెరీర్‌లోనే అత్యధికమని పేర్కొన్నాయి.
తన భర్త పీటర్ హాగ్‌పై నటి సెలీనా జైట్లీ గృహహింస కేసు పెట్టిన విషయం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా సెలీనా.. తన పిల్లలను ఈ వివాదంలోకి తీసుకురావొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. ‘నా గురించి రాసే వార్తల్లో నా పిల్లల ఫొటోలు వాడొద్దు. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నా. ఇప్పటికే ఈ విషయంలో నేను తల్లిగా ఎంతో బాధపడుతున్నా’ అంటూ పోస్ట్ పెట్టింది.