• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

‘టాక్సిక్’ టికెట్ ధర రూ.1200..?

కన్నడ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా టికెట్ ధరలపై బెంగళూరులో జోరుగా చర్చ సాగుతోంది. మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర దాదాపు రూ.1200 వరకు ఉండవచ్చని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమా కావడంతో, క్రేజ్‌కు తగ్గట్టుగా ప్రీమియం స్క్రీన్లలో ఈ స్థాయిలో ధరలు ఉండే అవకాశం ఉందని టాక్.

February 28, 2026 / 04:49 PM IST

ప్రాణహాని ఉన్నా పట్టించుకోను: జంగ్ కుక్

BTS స్టార్ జంగ్‌కుక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన కొత్త ఆల్బమ్ ‘అరిరంగ్’ విడుదల కానున్న నేపథ్యంలో.. మేనేజ్మెంట్ నిబంధనలకు అతీతంగా స్వేచ్ఛగా జీవిస్తానని, ప్రాణహాని ఉన్నా లెక్కచేయనని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. ఆయన భద్రతపై భయపడుతున్న ఫ్యాన్స్, సోషల్ మీడియా వేదికగా జంగ్‌కుక్‌కు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.

February 28, 2026 / 04:20 PM IST

మగాళ్ల రాజ్యంలో హీరోయిన్ల పరిస్థితి ఇదే: నటి

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఎంపికపై హీరోల ఆధిపత్యం గురించి నటి తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరోయిన్ల తలరాతలు హీరోల చేతుల్లోనే ఉంటాయని, స్టార్ డైరెక్టర్లు అయితే తప్ప మిగతా సమయాల్లో హీరోల మాటే చెల్లుతుందని పేర్కొంది. మగాళ్ల రాజ్యంలో హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉందని, హీరోలకు నచ్చకపోతే అవకాశం వచ్చినా తొలగిస్తారని కుండబద్ధలు కొట్టింది.

February 28, 2026 / 04:07 PM IST

ప్రధాని ఆశీర్వాదం తీసుకున్నాం: విజయ్‌

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలవడంపై నటుడు విజయ్ దేవరకొండ హర్షం వ్యక్తం చేశాడు. మోదీ ఆశీస్సులు తీసుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని, తన తల్లిదండ్రులకు ఆయన లేఖ రాయడం విశేషమని పేర్కొన్నాడు. అమిత్ షాతో సినిమా, సంస్కృతిపై చర్చించానని.. ఆయన కానుకగా ఇచ్చిన గణేష్ విగ్రహాన్ని తమ పూజా గదిలో ఉంచామని తెలిపాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.

February 28, 2026 / 04:02 PM IST

డేటింగ్ మొదటి నెలలోనే గర్భం: నటి

తన వ్యక్తిగత జీవితం గురించి నటి అమలా పాల్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. జగత్ దేశాయ్‌తో డేటింగ్ ప్రారంభించిన నెల రోజులకే తాను గర్భం దాల్చినట్లు తెలిపింది. ఆ తర్వాతే 2023 నవంబర్ 5న తమ వివాహం జరిగిందని, 2024 జూన్ 11న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది.

February 28, 2026 / 03:38 PM IST

చాలా మానసిక క్షోభ అనుభవించాం: నిర్మాత

విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘విష్ణు విన్యాసం’ చిత్రం లీకుల వివాదంలో చిక్కుకుంది. షూటింగ్ సమయంలోనే చిత్ర సన్నివేశాలు బయటకు రావడంతో యూనిట్ తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు నిర్మాత సుమంత్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఫిర్యాదు చేసినా ఫలితం లేక సినిమాను త్వరగా పూర్తి చేయాల్సి వచ్చిందని, ‘మృత్యుంజయ్’ చిత్రంతో పోటీ పడాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాడు.

February 28, 2026 / 03:12 PM IST

హీరో శ్రీవిష్ణు సంచలన వ్యాఖ్యలు

‘విష్ణు విన్యాసం’ లీక్ అవ్వడం వల్ల నిర్మాతను బ్లాక్‌మెయిల్ చేశారని శ్రీవిష్ణు చెప్పాడు. అందుకే వారం వ్యవధిలోనే తన 2 మూవీలను విడుదల చేస్తున్నట్లు తెలిపాడు. చెన్నై నుంచి మూవీని లీక్ చేసి, ప్రతి రీల్‌కు డబ్బుల కోసం వేధించారన్నాడు. ఈ ఒత్తిడి వల్ల 20 రోజుల షూటింగ్‌ను రాత్రింబవళ్లు శ్రమించి 7 రోజుల్లోనే పూర్తి చేశామని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు.

February 28, 2026 / 02:49 PM IST

‘ధురంధర్ 2’ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే?

రణ్‌వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ మూవీ 2026 మార్చి 19న విడుదల కానుంది. ‘ధురంధర్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది. దీనికి సెన్సార్ బోర్డు U/A 16+ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. అలాగే ఈ మూవీ రన్ టైం 3:40 గంటలుగా లాక్ చేసినట్లు టాక్. మొదటి భాగం(3:34 గంటలు)తో పోలిస్తే 6 నిమిషాలు ఎక్కువట.

February 28, 2026 / 02:22 PM IST

‘స్పిరిట్‌’ పోస్టర్‌లో కనిపించిన నటి ఎవరు?

ప్రభాస్, సందీప్ వంగా క్రేజీ కాంబో ‘స్పిరిట్’ నుంచి వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో వివేక్ సరసన కనిపించిన నటి గురించే చర్చ నడుస్తోంది. ఆమె ఇండో-అమెరికన్ నటి ఐశ్వర్య దేశాయ్. ‘గల్లీ బాయ్’ ఫేమ్ అయిన ఈ నటి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్, ఆమె కలిసి ప్రభాస్‌ను గట్టిగా ఢీకొట్టబోతున్నారని టాక్.

February 28, 2026 / 02:10 PM IST

అభిషేక్‌, బాబీ డియోల్ కాంబోలో మూవీ?

హిందీ నిర్మాత దీపక్ ముకుత్ త్వరలో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. బాబీ డియోల్, అభిషేక్ బచ్చన్ కాంబోలో ‘దో ఔర్ దో పాంచ్’ సినిమాను రీమేక్ చేయాలని ఆయన పదేళ్లుగా భావిస్తున్నాడట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ఇద్దరు హీరోల క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

February 28, 2026 / 01:33 PM IST

నాని, పవన్, ప్రభాస్‌లతో సుజీత్..!

నాని, సుజీత్ కాంబోలో వస్తున్న ‘బ్లడీ రోమియో’పై అంచనాలు పెరిగిపోయాయి. సుజీత్ తాజాగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, నానిల ఫోటోను షేర్ చేయడంతో తన ‘సినిమాటిక్ యూనివర్స్’పై హింట్ ఇచ్చినట్లయింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గనుక ‘సాహో’, ‘OG’ సినిమాలతో లింక్ అయితే నాని కెరీర్‌లోనే భారీ హైప్ క్రియేట్ అవ్వడం ఖాయం. ఈ అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు.

February 28, 2026 / 01:17 PM IST

‘స్పిరిట్‌’.. మరోసారి తెరపైకి ప్రకాష్ రాజ్‌ పేరు

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల ‘స్పిరిట్’ మూవీ నుంచి నటుడు ప్రకాష్ రాజ్ తప్పుకున్నారనే వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో, ఇతర అప్‌డేట్స్‌లో ఆయన పేరు లేకపోవడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి. గతంలో ఆయన ఈ వార్తలను ఖండించినప్పటికీ, తాజా పరిణామాలు ఆయన ప్రాజెక్టులో లేరనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

February 28, 2026 / 01:08 PM IST

వరలక్ష్మి ‘సరస్వతి’ కోసం నయనతార

నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సరస్వతి’. మార్చి 1న ఉదయం 10:04 గంటలకు ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. అయితే ఈ పాటను నయనతార రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించనుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

February 28, 2026 / 12:40 PM IST

మెగాస్టార్ మూవీలో బండ్ల గణేష్..?

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో వస్తున్న ‘మెగా-158’ చిత్రంపై అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్. చిరు వీరాభిమాని అయిన బండ్లన్న ఎంట్రీతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆయన పాత్ర ఫన్నీగా ఉంటుందా లేదా పవర్‌ఫుల్‌గా ఉంటుందా అన్నది సస్పెన్స్ అయినప్పటికీ, బండ్లన్న మార్క్ డైలాగులు పక్కా అని తెలుస్తోంది.

February 28, 2026 / 12:06 PM IST

‘ది కేరళ స్టోరీ 2’ రివ్యూ

తల్లిదండ్రుల మాటలను కాదని, ప్రేమించిన వారి కోసం ఇళ్లు వదిలి వెళ్లిన ముగ్గురు అమ్మాయిల కథే ‘ది కేరళ స్టోరీ 2’. తాము నమ్మిన ప్రేమే ఒక పెద్ద మోసమని తెలుసుకున్న వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే దర్శకుడు ఇందులో చూపించాడు. నటీనటుల ప్రతిభ, ఎమోషనల్ కథాంశం, సెకండాఫ్, క్లైమాక్స్ సన్నివేశాలు మూవీకి ప్లస్. కథను ఒకే కోణం నుంచి చూపడం, కొన్ని చోట్ల మితిమీరిన సినిమాటిక్ లిబర్టీ మైనస్.

February 28, 2026 / 11:56 AM IST