తమిళ సినీ పరిశ్రమలో ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇందులో భాగంగా ‘అమరన్’ సినిమాకు గాను ఉత్తమ నటిగా సాయి పల్లవి, ‘మహారాజ’ మూవీకి ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి అవార్డులు అందుకున్నారు. తమకి అవార్డు రావడంపై విజయ్, సాయి పల్లవి ఆనందం వ్యక్తం చేశారు. తమను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు.