KRNL: హోళగుంద ఎంఈవో -2గా కబీర్ సాబ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ప్రస్తుతం హోళగుంద జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా స్టేట్ టీచర్ యూనియన్ సభ్యులు స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో కబీర్ సాబ్‌ను ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారం, సమన్వయంతో మండల విద్యా శాఖను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.