ప్రకాశం: ఓ నిరుపేద కుటుంబాన్ని పీ – 4 కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ శుక్రవారం దత్తత తీసుకున్నారు. మద్దిపాడు మండలం మల్లవరంకి చెందిన మరియమ్మ కుటుంబాన్ని కలెక్టర్ దత్తత తీసుకున్నారు. వారి గృహానికి వెళ్లిన కలెక్టర్ కింద కూర్చొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.