ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత పేసర్ బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. అయినా అతడు పెద్దగా సంబరాలు చేసుకోలేదు. దీనికి కారణం ఏంటా? అని క్రికెట్ అభిమానుల్లో ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై బుమ్రా మాట్లాడుతూ.. ‘నేను బాగా అలసిపోయా. అందుకే ఎక్కువగా సంతోషపడలేకపోయా. ఎగిరి గంతులు వేయడానికి ఇప్పుడు నేనేమీ 21-22 ఏళ్ల కుర్రాడిని కాదు’ అని వెల్లడించాడు.