ATP: తాడిపత్రి మండలంలోని ఓబులేసు కోనలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబులేసుకోన శ్రీ లక్ష్మీనారసింహ స్వామిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.