సత్యసాయి: ధర్మవరంలోని 18వ వార్డు గాంధీనగర్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం పాదయాత్ర చేశారు. రైల్వే గేట్ సమీపంలో చెత్త వల్ల దుర్గంధం, దోమల బెడదపై స్థానికులు ఫిర్యాదు చేశారు. మంత్రి వెంటనే స్పందించి రెండు గంటల్లోనే జేసీబీతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. సమస్య తీరడంతో ప్రజలు, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.