KRNL: మంత్రాలయం సమీపంలో ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలో కర్ణాటకకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారి మిత్రులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాకు చెందిన ప్రమోద్, సచిన్, అజిత్ నది స్నానానికి వెళ్లగా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం ఎస్సై శివాంజల్, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.