NLG: బ్రతుకుతెరువు కోసం జార్ఖండ్ నుంచి వచ్చిన కార్మికుడు తీవ్రమైన జ్వరంతో మృతి చెందాడు. చిట్యాల SI వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం పిట్టంపల్లి సైమడ్ ఫార్మా కంపెనీలో శిగ్రాయ లోహ్ర(19) పని చేస్తున్నాడు. ఈనెల 8న తీవ్రమైన జ్వరంతో వెలిమినేడు PHCలో చికిత్స పొందాడు. జ్వరం తగ్గక నార్కట్పల్లి కామినేని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.