JGL: జగిత్యాలలోని ఐఎంఏ హాల్లో గైనకాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. HPV వ్యాక్సిన్ ద్వారా క్యాన్సర్‌ను నివారించవచ్చని ఐఎంఏ అధ్యక్షుడు డా. హేమంత్ తెలిపారు. 9 నుంచి 45 ఏళ్ల మహిళలందరికీ ఇది అవసరమని తెలిపారు. గైనకాలజీ అసోసియేషన్ కార్యదర్శి డా.శ్రీలత, వ్యాక్సిన్‌తో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చుని పేర్కొన్నారు.