KMR: పాల్వంచ మండలం భవానీపేట గ్రామ పంచాయతీ కిసాన్‌నగర్‌లో డెంగీ కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 13 మంది అనుమానితులను పరీక్షించగా నలుగురికి డెంగీ పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి ఆదర్శ్ తెలిపారు. వారిలో ఒకరికి పరిస్థితి విషమంగా ఉండటంతో కామారెడ్డి జీజీహెచ్‌కి తరలించినట్లు పేర్కొన్నారు. మిగిలిన బాధితులకు గ్రామంలోనే వైద్యం అందిస్తున్నామన్నారు.