SRD: కోహిర్ మండలంలో విద్యాశాఖ అనుమతులు లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని MEO జాకీర్ హుస్సేన్ శనివారం హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం విద్యాశాఖ అనుమతులు తీసుకోవాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడొద్దని సూచించారు.