CTR: తవణంపల్లి మండలం టీ పుత్తూరులో శ్రీ కోదండ రాముల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారు రథంపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ధర్మకర్త సిద్దేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో దర్శనం, తీర్థప్రసాదాలు సజావుగా అందాయి. చిత్తూరు వెస్ట్ సీఐ శ్రీధర్ నాయుడు, ఎస్సై చిరంజీవి పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.