SRD: వర్షాకాలం ప్రారంభమై నెల గడుస్తున్న వర్షాలు పడకపోవడంతో హత్నూర మండలంలో గ్రామస్థులు శనివారం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ పూజలు చేయడంతో సకాలంలో వర్షాలు పడాలని రైతులు భగవంతుణ్ణి వేడుకున్నారు. వర్షాలు పడక పోవడంతో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.