KDP: వల్లూరు బస్టాండు వద్ద సీఐ రోషన్, ఎస్సై పెద్ద ఓబన్న ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. శనివారం సాయంత్రం వాహనాల తనిఖీల్లో భాగంగా అనుమానిత బైకులు, కార్లు, ఇతర వాహనాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.