SRCL: ప్రజల భద్రత,శాంతి భద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేయడానికి, పోలీస్ శాఖ ముందంజలో ఉందని జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తెలిపారు. శనివారం వీర్నపల్లి మండల పోలీస్స్టేషన్ భవన నిర్మాణం కోసం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి ఎస్పీ భూమి పూజ చేశారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. వీర్నపల్లి లో రెండు ఎకరాలలో నూతన పోలీస్స్టేషన్ భవనం కేటాయించారని పేర్కొన్నారు.