లార్డ్స్ టెస్టులో భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. టీ బ్రేక్ సమయానికి 91 ఓవర్లలో 316 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. జడేజా(40), నితీశ్ రెడ్డి(25) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 143 బంతుల్లో 62 పరుగులు జోడించారు. కాగా, ఇంగ్లండ్ స్కోర్‌కు భారత్ ఇంకా 73 పరుగుల వెనకంజలో ఉంది. ఈ సెషెన్లో టీమిండియా కేఎల్ రాహుల్(100) వికెట్‌ను కోల్పోయింది.