ASR: చింతపల్లి మండలం బలపం పంచాయతీ దిగజనభ గ్రామంలో ప్రాధమిక పాఠశాలకు వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభించి నెలలు గడుస్తున్నా పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించలేదన్నారు. దీంతో బడికి వెళ్లే పిల్లలు, బడి బయట ఉంటున్నారని ఆవేదన చెందారు. బడికి వెళ్లాల్సిన పిల్లలు ఆటపాటలు, పొలంబాట పడుతున్నారన్నారు.