SKLM: మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం ఫిషరీస్ కార్యాలయంలో బందారువానిపేట గ్రామానికి చెందిన మత్స్యకారులకు సబ్సిడీతో కూడిన బోటు ఇంజన్ పరికరాల ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ శిర రమణయ్య ,టీడీపీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.