BDK: భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. శనివారం ఉదయం 7 గంటలకు 40.7 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 10:30 గంటలలో 41. 80 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో పాటు భద్రాచలం దిగువన శబరి నది ఉధృతి తో నీటిమట్టం క్రమంగా పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.