KRNL: హోళగుంద మండలం హెబ్బటం గ్రామంలోని కుంటలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన రైతులు చూసి భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనతో గ్రామంలో కలకలం రేగింది. మృతుడి వివరాలు గుర్తించాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.