KMM: ముదిగొండ మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వాసిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హరిత పాల్గొని, గంజాయి, పొగాకు ఉత్పత్తుల వాడకంతో జరిగే అనర్థాలు, శిక్షల గురించి విద్యార్థలకు వివరించారు. మత్తు పదార్థాల వాడకం జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు.