KRNL: దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామంలో ఫోన్ కొనివ్వలేదన్న కారణంతో 16 ఏళ్ల శ్రీనాథ్ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జూన్ 9న ఈ ఘటన జరగగా.. కుటుంబ సభ్యులు శ్రీనాథ్‌ను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. నెలరోజుల పాటు చికిత్స పొందిన శ్రీనాథ్ గురువారం రాత్రి మృతిచెందాడు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన శ్రీనాథ్ మృతిపై గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.