SRD: పాఠశాలల పర్యవేక్షణ ఉపాధ్యాయులకు అప్పగించవద్దని STU జిల్లా అధ్యక్షుడు సాబేర్ అలీ డిమాండ్ చేశారు. కాగా, సంగారెడ్డిలోని సంఘ భవనంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా STU ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రాన్ని సమర్పించినట్లు చెప్పారు. పర్యవేక్షణ అధికారి పోస్టులను మంజూరు చేయాలని కోరారు.