బీహార్లోని పాట్నా విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. జయప్రకాశ్ నారాయణ ఎయిర్పోర్టులో బాంబు ఉందని ఈ-మెయిల్ ద్వారా దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని, బెదిరింపులు బూటకమని విమానాశ్రయ అధికారులు తేల్చారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.