HNK: ప్రతి శనివారం చిన్నపిల్లలకు, అవుట్ రీచ్ ఇమునైజేషన్ సెషన్ నిర్వహించడంలో భాగంగా హన్మకొండ DMHO డా. అల్లం అప్పయ్య ఎల్కతుర్తి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సూరారం, ఇందిరానగర్, వల్బాపూర్ల గ్రామాలలో జరుగుతున్న టీకాల కార్యక్రమంను ఆయన తనిఖీ చేశారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు ఇంటింటా తిరుగుతూ అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు