WGL: భగవద్గీత పఠనంతో సన్మార్గంలో పయనిస్తారని డా.ఎన్.నర్సింహారావు అన్నారు. వరంగల్ AVV జూనియర్ కళాశాలలో శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా శనివారం వరంగల్ సుందర సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత పద్య పఠన పోటీలు నిర్వహించారు. పోటీలలో నగరంలోని వివిధ పాఠశాలల నుంచి పెద్దఎత్తున పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు నిర్వాహకులు భగవద్గీత పుస్తకాలు అందించారు.