వింబుల్డన్ పురుషుల సెమీఫైనల్లో నొవాక్ జకోవిచ్ ఓటమిపాలయ్యాడు. జకోవిచ్ పై వరల్డ్ నం.1 సినర్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ మ్యాచ్‌లో సినర్ 6-3, 6-3, 6-4తో వరుస సెట్లలో జకోవిచ్‌ను ఓడించాడు. దీంతో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవాలనుకున్న జకోవిచ్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగే ఫైనల్లో అల్కారాజ్‌తో సిన్నర్ తలపడనున్నాడు.