SKLM: నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన సోంపేట పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ రిసెప్షన్ కేంద్రంలో రికార్డులు నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కార తదితర అంశాలను పరిశీలించి.. మహిళా సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.