ప్రకాశం: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తర్లుపాడు మండలం మీర్జాపేటలో ఎమ్మార్వో కిషోర్ కుమార్ శుక్రవారం రెవిన్యూ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవిన్యూకు సంబందించిన భూ సమస్యలు ఉంటే ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.