NZB: జిల్లాలో పెద్దపులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. సిరికొండ మండలం తాటిపల్లి అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు పెద్దపులి పాదముద్రలను సేకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పులి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. S 12 పెద్దపులిగా దానిని అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.