GNTR: మంగళగిరి నగరంలోని గౌతమబుద్ధ రోడ్డులో గల కాళీమాత అమ్మవారి ఆలయంలో శుక్రవారం శాకాంబరి ఉత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరీ దేవిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.