SRCL: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి, నాంపల్లి ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా అకాడమీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాసు తెలిపారు. ఈనెల 15, 16 తేదీలలో 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల బాలబాలికలు సరైన ధ్రువపత్రాలతో హైదరాబాద్లోని గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియంకు రావాలి అన్నారు.