KRNL: పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి పదవులు దక్కుతాయని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి అన్నారు. శుక్రవారం చిప్పగిరి వైసీపీ కార్యాలయంలో వివిధ విభాగాల మండల అధ్యక్షులుగా ఎన్నికైన వారు MLAను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.