NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ దేవస్థానంలో ఆషాడ మాసం శుక్రవారం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఆషాడం సారే సమర్పించి, ప్రత్యేక పుష్పాలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. మహిళలు వారి శక్తి కొలది అమ్మవారికి పసుపు, పూలు, కుంకుమ, పండ్లు,తదితర వస్తువులను అందజేశారు.