అన్నమయ్య: రామాపురం మండలం కుమ్మరపల్లి గ్రామం మన్నేరు వాండ్లపల్లెలో ఇటీవల మరణించిన టీడీపీ కార్యకర్త మన్నేరు వెంకటేశ్వర్లు కోడలు లత కుటుంబాన్ని శుక్రవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని మంత్రి ముందుకొచ్చి రూ. లక్ష ఆర్థిక సహాయం ప్రకటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.